Oct 18,2019 11:45AM
మచిలీపట్నం: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా పెడన మండలం నందిగం వద్ద చోటు చేసుకుంది. బైక్‌పై వెళుతున్న వ్యక్తిని నందిగం వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. మృతుడు పెడన మండలం మడక గ్రామానికి చెందిన బొర్రా భాస్కరరావుగా గుర్తించారు.