Oct 16,2019 09:55AM
హైదరాబాద్: మంగళగిరిలో 2018 బ్యాచ్ డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. అనంతపురం పీటీసీలో ఏడాదిపాటు శిక్షణ పొందిన 25 మంది డీఎస్పీలు పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 11 మంది మహిళా డీఎస్పీలు ఉన్నారు.