Oct 16,2019 08:54AM
అమరావతి: మరికాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఉదయం 10.30కి జరగబోయే ఈ సమావేశంలో సంక్షేమ పథకాలే ప్రధాన అజెండాగా నిలవబోతున్నాయి. కొత్త సంక్షేమ పథకాలకు విధివిధానాలపై చర్చ జరగనుంది. చేనేత కార్మికుల కుటుంబానికి ఏటా 24 వేల ఆర్థికసాయం.. సంక్షేమ కార్పొరేషన్లల ద్వారా వివిధ వర్గాలకు వాహనాల పంపిణీ తదితర విషయాలపై చర్చించనున్నారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. వాటర్‌గ్రిడ్, అమ్మ ఒడి పథకం, ఉద్యోగాల భర్తీపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.