Oct 15,2019 09:29PM
హైదరాబాద్: విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్(వీఎమ్‌సీ) పటమట సర్కిల్ పరిధిలోని మూడు ఆఫీసులలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) మెరుపుదాడి చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న సూర్య భగవాన్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇంటిపన్నులో పేరు మార్చడానికి సూర్య భగవాన్ డబ్బులు డిమాండ్ చేయడంతో.. బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సూర్య భగవాన్‌ను ట్రాప్ చేసి పట్టుకున్నారు. రూ. 9వేల నగదు స్వాధీనం చేసుకొని అతడిని కస్టడీలోకి తీసుకొన్నారు. ఈ తనిఖీల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీ కనకరాజులు పాల్గొన్నారు.