Oct 15,2019 07:13PM
హైదరాబాద్: కమీషన్ల కోసమే కేసీఆర్ కొత్త పథకాలు తెస్తున్నాడని టీడీపీ నేత ఎల్.రమణ మండిపడ్డారు. హుజూర్‌నగర్‌లో టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉందన్నారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్..మాయల, మోసాల తెలంగాణ తెచ్చాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీతో కలిసివచ్చే పార్టీలను కలుపుకొని పోతామన్నారు.