న్యూఢిల్లీ: ఆర్థిక శాస్త్రంలో నోబెల్-2019 బహుమతి గెలుచుకున్న భారత సంతతి అభిజిత్ బెనర్జీ.. పది రోజుల పాటు తీహార్ జైలు జీవితం గడిపారట. ఢిల్లీలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయం జేఎన్‌యూలో చదువకునే రోజుల్లో.. ఒక నిరసనలో పాల్గొన్నందుకు ఆయనను 10 రోజుల పాటు తీహార్ జోల్లో బంధించారట. 1983లో జరిగిందీ సంఘటన.అయితే ఇది రాజద్రోహం వంటి పెద్ద పెద్ద ఆరోపణల్ని ఎదుర్కొన్న 2016 నాటి జేఎన్‌యూ సంఘటన లాంటిది కాకపోయినా.. నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లలో వేశారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌ను ఆయన ఇంట్లోనే ఘెరావ్ చేశారు. అప్పటికి ఇలా చేయడం పదవ సారి. అందుకే పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందించి, నిరసనకు దిగిన విద్యార్థులపై లాఠీ చార్జీకి దిగారు. తనతో పాటు అతడి స్నేహితులను తీహార్ జైలుకు తరలించి 10 రోజుల పాటు కొడుతూనే ఉన్నారని అభిజిత్ చెప్పుకొచ్చారు. అయితే తమపై రాజద్రోహం లాంటి కేసులేవీ పెట్టలేదని గుర్తు చేసుకున్నారు.
Oct 15,2019 04:58PM