Oct 15,2019 03:30PM
జైపూర్ : జమ్ము కాశ్మీర్‌లో పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అన్నారు. జమ్ము కాశ్మీర్‌లో రాజస్థాన్‌కు చెందిన ఒక ట్రక్కు డ్రైవర్‌ను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేయడాన్ని ఆయన ఖండించారు. ఇదెంతో బాధాకరమైన విషయమని ఆయన అన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి, కాశ్మీర్‌లో పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి జరపాల్సిన అవసరముందని ఆయన అన్నారు.