Oct 15,2019 01:32PM
వరంగల్ : వృద్ధురాలిని ఢీకొట్టి ఆర్టీసీ బస్సు తాత్కాలిక డ్రైవర్ పరారవడం కలకలం రేపుతోంది. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పెరపెల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీంతో తాత్కాలిక డ్రైవర్ బస్సును వదిలి పెట్టి పారిపోయాడు.