హైదరాబాద్: ఢీల్లీలో జరుగుతున్న డీఆర్‌డీవో కాన్ఫరెన్స్‌లో జాతీయ భద్రతా సలహాదారుడు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ మాట్లాడారు. మనకు అనుగుణమైన టెక్నాలజీతో భారత్‌ను మరింత సురక్షితంగా తయారు చేయాలన్నారు. అవసరానికి తగినట్లుగా సాంకేతికను పెంచుకోవాలన్నారు. రక్షణ శాఖ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కలిపి మనకు కావాల్సిన టెక్నాలజీ గురించి అంచనా వేయాలన్నారు. మన లోపాలను అధిగమించే టెక్నాలజీని పొందాలని దోవల్ తెలిపారు. మేటి ఆయుధాలు ఉన్న ఆర్మీ ఎప్పుడూ పైచేయి సాధిస్తుందని చెప్పారు. ఉత్తమ శ్రేణి టెక్నాలజీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, కానీ భారత్ ముందు నుంచి రన్నరప్‌గానే ఉందని, రన్నరప్ కోసం ట్రోఫీ ఏమీ ఉండదన్నారు. ఉంటే మేటీగా ఉండాలి, లేకుంటే అలాంటిదేమీ ఉండదన్నారు. ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ, డబ్బు ప్రాంతీయ రాజకీయాలను శాసిస్తాయన్నారు. అయితే ఈ రెండు అంశాలపై పట్టు ఉన్నవాళ్లు మాత్రమే విజయం సాధిస్తారని దోవల్ తెలిపారు. అయితే దీంట్లో టెక్నాలజీ అత్యంత కీలకమైందని అన్నారు.
Oct 15,2019 12:08PM