Oct 15,2019 12:05PM
హైదరాబాద్: పూరీ జగన్నాథ్ నిర్మాణంలో ఆకాశ్ పూరి, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రొమాంటిక్. అనీల్ పాడూరి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇందులో హీరో హీరోయిన్స్ చాలా రొమాంటిక్‌గా కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు మకరంద్ దేశ్ పాండే, మందిరాబేడీ కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతుండగా, సెట్‌లో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో సెట్ ప్రాపర్టీ కొంత దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అంటున్నారు.