Oct 15,2019 07:13AM
మహారాష్ట్ర: మహారాష్ట్రాలోని ముంబై నగర పరిధిలోని కామాటిపురా వ్యభిచార గృహంలో దారుణం వెలుగుచూసింది. ముంబై నగరానికి చెందిన కేటరింగ్ పనులు చేస్తున్న యువకుడు విటుడిగా ఈ నెల 13వతేదీన కామాటిపురా వ్యభిచార గృహానికి వచ్చారు. ఓ వ్యభిచారిణి తనను అధికంగా డబ్బు అడిగిందనే కోపంతో యువకుడు కత్తిత్తో ఆమెపై దాడి చేసి 30 కత్తిపోట్లు పొడిచాడు. 30సార్లు కత్తితో పొడవటంతో వ్యభిచారిణి రక్తసిక్తమై అక్కడికక్కడే మరణించింది. అనంతరం యువకుడు పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. వ్యభిచారిణిని చంపిన విటుడిని ముంబై పోలీసులు మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.