Oct 13,2019 09:50PM
నల్లగొండ జిల్లా: ఫిలిప్పీన్స్ అమ్మాయి, తెలంగాణ అబ్బాయి వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఆదివారం నల్లగొండ జిల్లా హిల్‌కాలనీలోని విజయవిహార్‌లో వీరిద్దరి వివాహం వైభవంగా జరిగింది. నాగార్జునసాగర్ హిల్‌కాలనీకి చెందిన సందీప్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసి సౌదీలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. సందీప్ కు అదే హోటల్‌లో పని చేస్తున్న ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన రిచ్చల్ బోర్నాల్స్(చందన)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరువురు తమ ప్రేమ విషయాన్ని కుటుంబ పెద్దలకు చెప్పి వివాహానికి ఒప్పించారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది.