Oct 13,2019 08:41PM
హైదరాబాద్: భారతదేశం హిందూ రాష్ట్రం వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా చరిత్ర చదివినా ఈ విషయం బోధపడుతుందని అన్నారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు ఓవైసీ. 'భాగవత్.. నా చరిత్రను నువ్వు చెరిపివేయలేవు. హిందూ రాష్ట్ర అనేది జరగని పని. మన సంస్కృతులు, విశ్వాసాలు, మతాలు, వ్యక్తిగత గుర్తింపులు అన్నీ హిందూమతం చేయాలనుకోవడం ఆయన పట్టుబట్టలేరు. భారత్ గతంలో హిందూ రాష్ట్రం కాదు. ప్రస్తుతమూ కాదు. ఇకపై కూడా కాబోదు' అని ట్వీట్ చేశారు. దీనికి తోడు మోహన్ భాగవత్ ప్రసంగిస్తున్న వీడియోను షేర్ చేశారు.