Oct 13,2019 07:52PM
వరంగల్: ఆర్టీసీ మంత్రి ఎప్పుడన్నా ఉద్యమంలో పాల్గొన్నాడా? అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల ఇంక్రిమెంట్స్ పాము నిచ్చెనలా జీవితకాలంలో చూడనివారు ఉన్నారని, కేసీఆర్‌కు మెఘా కృష్ణా రెడ్డి దగ్గరయ్యారని, తెలంగాణ ప్రజలు దురమయ్యారనన్నారు. గడప దాటినోళ్లు అటే అంటున్న కేసీఆర్‌కు.. తానే గడప దాటి ఉన్నారనే విషయం అర్థం కావటం లేదన్నారు. ఆర్టీసీని కాపాడుకోవడం అందరి బాధ్యతని, ఆర్టీసీ ఖర్చులకు ప్రభుత్వమే నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.