నెల్లూరు :ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భవించి 50 ఏళ్లు అయిన సందర్భంగా నెల్లూరు నగరంలోని టౌన్ రీడింగ్ రూములో ఈరోజు నగరంలోని ఎనిమిది కళాశాలలకు చెందిన 164 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ బి.రాజేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో రెండు నెలల నుంచి విషజ్వరాలు, డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయన్నారు. జ్వర పీడితులతో నగరంలోని ప్రయివేట్, ప్రభుత్వ వైద్యశాలలు కిటకిటలాడుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో యువత రక్తదానం చేస్తే ఎంతో ఉపయోగమన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm