Jan 15,2019 02:01PM-13
శ్రీనగర్ : పాకిస్థాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని సుందర్బని సెక్టార్‌లో పాకిస్థాన్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భారత బలగాలు అప్రమత్తమయ్యాయి. పాక్ రేంజర్ల కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. ఇక హీరానగర్ సెక్టార్‌లో జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.