Nov 20,2018 08:11AM-1
హైదరాబాద్ : మిలాద్ ఉల్ నబీ సందర్భంగా బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పాతబస్తీతోపాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. చాదర్‌ఘాట్ వద్ద ఆర్టీసీ బస్సుల మళ్లింపు ఉంటుందని, ఎస్‌జే రోటరీ, మీరాలం మండి రోడ్డు ర్యాలీ ముగిసే వరకు బస్సులకు అనుమతి ఉండదని వెల్లడించారు. ర్యాలీలో పాల్గొనేవారు తమ వాహనాలను చార్మినార్ బస్ టర్మినల్‌లో పార్కు చేయాలని సూచించారు.