Nov 20,2018 08:11AM-1
సికింద్రాబాద్: అతివేగంతో బైక్ నడపడం వల్ల ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. సికింద్రాబాద్ మెట్టుగూడలో గత అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. షికారుకు బయలుదేరిన ముగ్గురు యువకులు అతివేగంగా బైక్ నడిపించారు. దీంతో అదుపుతప్పిన బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు ఉదయ్ రెడ్డి(21), ఉదయ్(24), పృథ్వీ(21)గా గుర్తించారు. అతివేగం, అజాగ్రత్తగా బైక్ నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.