న్యూఢిల్లీ: భారత మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. భారీ బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరాతో నమ్మలేనంత తక్కువ ధరతో ఐటెల్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం లాంచ్ చేసింది. ఐటెల్ ఎ44 పవర్ పేరుతో వచ్చిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్) ఓఎస్, 1 జీబీ ర్యామ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
ఐటెల్ ఎ44 పవర్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,999 మాత్రమే. నేటి నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. వంద రోజుల రీప్లేస్‌మెంట్ వారంటీ ఉన్నప్పటికీ లాంచింగ్ ఆఫర్లు ప్రకటించలేదు. ఆక్వా బ్లూ, చాంపేన్ గోల్డ్, డీప్ గ్రే కలర్ వేరియంట్లలో అందుబాటులో ఫోన్ అందుబాటులో ఉంది.
స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్), 5.45 అంగుళాల డిస్‌ప్లే, 64 బిట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ, 32 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి. 5 ఎంపీం0.3 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కలిగిన ఈ ఫోన్‌లో 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించారు.
Nov 19,2018 07:11PM-6