హైదరాబాద్ : శ్రీలంక పార్లమెంట్ రెండు రోజులు రణరంగంగా మారి అట్టుడికిపోతోంది. రాజపక్సె బలపరీక్షలో ఓడిపోయారని వెంటనే ఎన్నికలు నిర్వహించాలన్న విక్రమసింఘే డిమాండ్‌పై ఓటింగ్ జరపాలని స్పీకర్ జయసూర్య అంగీకరించడంతో సభలో మొదలైన గొడవ కాస్త ఎంపీలు రౌడీల్లా దాడులు చేసుకొనే పరిస్థితికి వచ్చింది. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాలన సిరిసేన గత నెలలో విక్రమ్ సింఘేని ప్రధాని పదవి నుంచి తప్పించి రాజపక్సెని నియమించి ఉన్నపళంగా పార్లమెంట్‌ను రద్దుచేశారు. తనను పదవి నుంచి తొలగించే అధికారం అధ్యక్షుడికి లేదని, పార్లమెంట్ లోనే బలం నిరూపించుకుంటానని విక్రమ్ సింఘే కోర్టు కెక్కడంతో ఎట్టకేలకు బుధవారం పార్లమెంట్ లో బలపరీక్ష నిర్వహించడంన 225 మంది సభ్యులున్న పార్లమెంట్ లో రాజపక్సెకు మద్దతుగా 122 మంది ఎంపీలు ఓటేసినా ఆ ఫలితాన్ని అధ్యక్షుడు సిరిసేన ఆమోదించకపోవడంతో శుక్రవారం మళ్లీ ఓటింగ్ నిర్వహించగా బలపరీక్షలో రాజపక్సె ఓడిపోయారు. ఇక్కడ మొదలైన గొడవ సిరిసేన, రాజపక్స మద్దతుదారులైన కొందరు ఎంపీలు స్పీకర్‌ను చుట్టుముట్టి దాడికి యత్నించగా విక్రమ్‌సింఘే పార్టీకి చెందిన సభ్యులు రక్షణగా నిలిచారు. ఈ క్రమంలో ఒక సభ్యుడు స్పీకర్ మైక్‌ను విరగ్గొట్టారు. మరొకరు డస్ట్‌బిన్‌ను, పుస్తకాలను ఆయనపైకి విసిరేశారు.
Nov 16,2018 08:11PM-7