Nov 16,2018 08:11PM-7
విజయనగరం: సీఎం చంద్రబాబుపై సినీనటుడు ఆర్. నారాయణమూర్తి విమర్శలు గుప్పించారు. కేంద్రంపై చంద్రబాబు చేస్తున్న పోరాటం నాలుగేళ్ల క్రితమే చేసి ఉంటే హోదా వచ్చేదని వ్యాఖ్యానించారు. హోదా ఇచ్చేవారికే ఏపీ ప్రజలు ఓట్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీకి మొదటి నుంచి అన్యాయం జరుగుతూనే ఉందని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన నేతలు ఏమైపోయారని ప్రశ్నించారు. తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ఆర్. నారాయణమూర్తి దుయ్యబట్టారు.