Nov 16,2018 07:11PM-8
వాషింగ్టన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేపై అమెరికా అభియోగాలు మోపింది. ఈ విషయాన్ని వికీలీక్స్ సంస్థ వెల్లడించింది. 2010లో అమెరికాకు చెందిన ఎన్నో పత్రాలు లీక్ చేసిన కేసులో ఆయనపై అభియోగాలు నమోదైనట్లు తెలిపింది. ఏ తరహా అభియోగాలు నమోదయ్యాయో కచ్చితంగా తెలియరాలేదని పేర్కొంది. సీల్ చేయని కోర్టు డాక్యుమెంట్లు అనుకోకుండా బయటకు రావడం వల్ల ఈ విషయం బయటపడినట్లు తెలుస్తోంది. అసాంజేపై స్వీడన్‌లో రేప్ ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అసాంజే లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకున్నసంగతి తెలిసిందే. ఈక్వెడార్ ప్రభుత్వమే ఆయన రక్షణ బాధ్యతలు చూసుకుంటోంది.