Nov 16,2018 09:11AM-1
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా సినీ అభిమానులు అందరు దీపికా- రణ్‌వీర్‌ల పెళ్లి హంగామాలో మునిగి తేలుతున్నారు. పెళ్లికి వెళ్ళకపోయిన అక్కడి వివరాలని ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆనందిస్తున్నారు. ఇక మరి కొద్ది రోజులలో దేశి గార్ల్ ప్రియాంక చోప్రా తన ప్రియుడు నిక్ జోనాస్‌ని వివాహం చేసుకోనుండగా, వీరి వివాహ వేదిక ఎక్కడనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది. గతంలో ప్రియాంకా, నిక్‌లు.. తమ పెళ్లి కోసం హవాయి దీవులను వేదికగా ఫిక్స్ చేసినట్లు వార్తలు రాగా, తాజాగా వీరి వెడ్డింగ్ వెన్యూగా జోధ్‌పూర్ ఉమైద్ భవన్ ప్యాలెస్‌ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. డిసెంబర్‌లో వీరి వివాహం జరగనుండగా, ఈ నెలాఖరు నుండి ప్రియాంక- నిక్‌ల పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరగనున్నట్టు తెలుస్తుంది.