హైదరాబాద్: టీ-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్శింహ సతీమణి పద్మినీరెడ్డి నిన్న బీజేపీలో చేరి ఆశ్చర్యం కలిగించడం, ఆ ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపే కాంగ్రెస్ లోనే కొనసాగుతానంటూ సంచలన రేకెత్తించిడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా నేత, నటి మాధవి స్పందించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో లో ఓ పోస్ట్ చేశారు. 'పొద్దున్నే మోడీ జీ ఐడియాలజీ సూపర్.. సాయంత్రం అయ్యేసరికి పోయింది. చేరబోయే ముందు ఆలోచన లేదా? పసిపిల్లలా? పాలు తాగుతున్నారా ఏమి తెలియకపోవడానికి. పద్మినీ రెడ్డి గారూ చాలా గొప్ప ప్లాన్ తో కోవర్ట్ పాలిటిక్స్ చెయ్యడానికి బీజేపీ లోకి అడుగువేశారు. మోడీ పాలన నచ్చిందా? లేదా వచ్చే ఎన్నికలలో బీజేపీ ప్లాన్స్ తెలుసుకొని ద గ్రేట్ డియర్ హజ్బెండ్ ఉన్న పార్టీలో చెప్పడానికా? దేనికోసం ఈ నాటకం? నమ్మి ఘనంగా వెల్ కమ్ చెప్పడం బీజేపీ తప్పు కాదు. ఇలాంటి వాటిని కోవర్ట్ పాలిటిక్స్ అంటారు. ఇవి చెయ్యడం ఒక కాంగ్రెస్ కి మాత్రమే చెల్లుతుంది. ఇలాంటి ఉడతా జంప్స్ కి బీజేపీ కదిలేది లేదు. మోదీ జీ వణికేది లేదు్ణ అని తన పోస్ట్ లో మాధవి విరుచుకుపడ్డారు.
Oct 12,2018 08:10PM-6