దుబాయ్: ఆసియాకప్‌లో భారత్-అఫ్గానిస్థాన్ మధ్య సూపర్-4 మ్యాచ్! టీమ్‌ఇండియా గెలవాలంటే 12 బంతుల్లో 13 పరుగులు చేయాలి.. ఇద్దరు రనౌట్ అయిపోయారు.. 6 బంతుల్లో 7 పరుగులు చేయాలి చేతిలో ఉంది ఒకే వికెట్ రషీద్‌ఖాన్ చేతిలో బంతి! ఈ స్థితిలో ఆల్‌రౌండర్ జడేజా రెండో బంతికి ఫోర్ కొట్టి ఆశలు రేపాడు. ఆ తర్వాత మరో రెండు సింగిల్స్ రావడంతో స్కోర్లు సమమయ్యాయి. ఇంకా రెండు బంతులు ఉండడం.. జడేజా స్ట్రైకింగ్‌లో ఉండడంతో భారత్‌దే విజయంగా కనిపించింది. కానీ ఐదో బంతిని గాల్లోకి లేపిన జడేజా ఔట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. భారత ఇన్నింగ్స్‌లో రాహుల్ (60: 66 బంతుల్లో 5x4, 1x6), అంబటి రాయుడు (57: 49 బంతుల్లో 4x4, 4x6) రాణించగా.. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్ మహ్మద్ షెజాద్ (124: 116 బంతుల్లో 11x4, 7x6) శతకం సాధించాడు. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే ఫైనల్ చేరింది.
అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్: షెజాద్ (సి) కార్తీక్ (బి) జాదవ్ 124బీ అహ్మది (స్టంప్డ్) ధోని (బి) జడేజా 5బీ రహ్మత్‌షా (బి) జడేజా 3బీ హస్మతుల్లా షాహిది (స్టంప్డ్) ధోని (బి) కుల్‌దీప్ 0బీ అస్గర్ (బి) కుల్‌దీప్ 0బీ నయిబ్ (సి) జాదవ్ (బి) చాహర్ 15బీ నబి (సి) కుల్‌దీప్ (బి) ఖలీల్ అహ్మద్ 64బీ జర్దాన్ ఎల్బీ (బి) జడేజా 20బీ రషీద్‌ఖాన్ నాటౌట్ 12బీ ఆఫ్తాబ్ నాటౌట్ 2బీ ఎక్స్‌ట్రాలు 7బీ
మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 252బీ
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ ఎల్బీ (బి) రషీద్ 60బీ రాయుడు (సి) నజిబుల్లా (బి) నబి 57బీ కార్తీక్ ఎల్బీ (బి) నబి 44బీ ధోని ఎల్బీ (బి) అహ్మది 8బీ పాండే (సి) షెజాద్ (బి) ఆఫ్తాబ్ 8బీ జాదవ్ రనౌట్ 19బీ జడేజా (సి) నజిబుల్లా (బి) రషీద్ 25బీ చాహర్ (బి) ఆఫ్తాబ్ 12బీ కుల్‌దీప్ రనౌట్ 9బీ కౌల్ రనౌట్ 0బీ అహ్మద్ నాటౌట్ 1బీ ఎక్స్‌ట్రాలు 9బీ
మొత్తం: (49.5 ఓవర్లలో ఆలౌట్) 252బీ
Sep 26,2018 07:09AM-7