Sep 25,2018 10:09AM-1
నీటి కొరతతో ఇబ్బందిపడే హైదరాబాద్ మహానగరానికి అలాంటి పరిస్థితి నుంచి కాస్త ఊపశమనం కలుగనుందని అధికారులు తెలిపారు.కొంతకాలంగా తాము నిర్వహిస్తున్న 'జలం-జీవం' క్యాంపైన్ ద్వారా చాలా ప్రాంతాల్లో ఇంకుడు గుంతులు ఏర్పాటు చేయగా ఇటీవల కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాల్లో భూగర్బ జలమట్టం గణనీయంగా పెరిగిందన్నారు.దాదాపు 60% ప్రాంతాల్లో వచ్చే ఏడాది వేసవిలో నీటి ఎద్దడి అంతగా ఉండకపోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.