Sep 24,2018 01:09PM-7
పనజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తన కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులను తొలగించారు. అనారోగ్యంతో బాధపడుతున్నారన్న కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరూ బీజేపీకి చెందిన వాళ్లే. ప్రాన్సిస్ డిసౌజా, పాండురంగ్ మడ్‌కైకర్ ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీళ్లద్దరి స్థానంలో కొత్త వాళ్లను తీసుకోనున్నారు. నిజానికి మనోహర్ పారికర్ కూడా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పాన్‌క్రియాటిక్ చికిత్స పొందుతున్నారు. పట్టణాభివృద్ధి శాఖ చూసుకుంటున్న డిసౌజాను, విద్యుత్‌శాఖ చూస్తున్న మడ్‌కైకర్‌ను తొలగించాలని పారికర్ ఆదేశాలు జారీ చేసినట్లు సీఎంవో వెల్లడించింది.