Mar 17,2018 09:03PM-6
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి తరచూ విమర్శలు ఎదుర్కొనే ఎఫ్‌బీఐ సీనియర్ అధికారి ఆండ్రూ మెక్‌కాబేపై వేటు పడింది. గతంలో ఎఫ్‌బీఐ ఉప సంచాలకుడిగా పనిచేసి మరో రెండు రోజుల్లో పదవీ విరమణ చేయనున్న ఆండ్రూని ఉద్యోగంలో నుంచి తొలగించినట్లు అటార్ని జనరల్ జెఫ్ సెషన్స్ ప్రకటించారు. హిల్లరీ క్లింటన్ ఈ-మెయిల్‌ల వ్యవహారం దర్యాప్తు వివరాలను నిబంధనలకు విరుద్ధంగా ఆండ్రూ మీడియాకు వెల్లడించినట్లు క్రమశిక్షణ సంఘం తేల్చిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు సెషన్స్ వివరించారు. ఎఫ్‌బీఐలో 20ఏళ్లకు పైగా పనిచేసిన ఆండ్రూ మెక్‌కాబే అనేక కీలక కేసులు దర్యాప్తు చేశారు. జనవరిలో ఉప సంచాలకుడి పదవి నుంచి అర్థాంతరంగా తప్పుకున్న ఆయన అప్పటినుంచి సెలవుపై ఉన్నారు.