సుజన్‌పూర్: హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయాన్ని నమోదు చేసింది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు ఆ పార్టీకి కొత్త చిక్కు వచ్చిపడింది. హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ పోటీపడ్డారు. అయితే ఆయన అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దాదాపు మూడు వేల ఓట్ల తేడాతో ధుమాల్ ఓడినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు బీజేపీ కొత్త సీఎం వేటలో పడింది. సుజన్‌పూర్ నియోజకవర్గం నుంచి ధమాల్ పోటీలో నిలిచారు. ఓటమిపై ధుమాల్ స్పందించారు. తన ఓటమి తనకు వ్యక్తిగతంగా నష్టమే అని అన్నారు. కానీ రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడడం సంతోషకర విషయమన్నారు. బీజేపీకి ఓటేసిన రాష్ట్ర ప్రజలకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. సాధారణంగా రాజకీయాల్లో ఒకరు గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు, కానీ నేను ఓడిపోతానని అనుకోలేదు, అసలు ఏం జరిగిందో దాని గురించి విశ్లేషిస్తామని ధుమాల్ తెలిపారు.
Dec 18,2017 05:12PM-7