హైదరాబాద్ : గుజరాత్‌లో తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ కు కాకుండా మోడీ వర్సెస్ రాహుల్ మధ్య జరిగినట్లుగా అందరు అభివర్ణింస్తున్నారు. చాలామంది ఈ నైతికంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది చాలామంది నాయకులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే దీనిపై బీజేపీ నేతలు కూడా తమదైన రీతిలోనే స్పందిస్తున్నారు. 22 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ప్రజలు ఇక తమనే కావాలనుకుంటున్నారని వారు వివరించారు. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నైతిక విజయం సాధించిందని కొందరు వ్యాఖ్యానించారని, అప్పుడు నైతిక విజయం ఇప్పుడు నైతిక విజయం సాధిస్తే ఇక అసలు విజయం ఎప్పుడని ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికలపై మమతా బెనర్జీ స్పందించారు. గుజరాత్ లో బీజేపీ నైతికంగా ఓటమిపాలైందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. గుజరాత్ లో బీజేపీ విజయం సాధించడంపై 'ట్విట్టర్' ద్వారా ఆమె స్పందించారు. సమతూకంగా తీర్పిచ్చిన గుజరాత్ ఓటర్లకు అభినందనలు తెలుపుతున్నానని, గుజరాత్ లో బీజేపీది తాత్కాలిక విజయమని, అవినీతి, అన్యాయం, కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని అన్నారు.
Dec 18,2017 05:12PM-7