Dec 15,2017 09:12PM-6
హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో గల ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు epass.cgg.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తిచేసిన దరఖాస్తు ఫారాలను సంబంధిత పాఠశాలల ప్రదానోపాధ్యాయులకు సమర్పించాలన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 100 చొప్పున 10నెలలకు గాను స్కాలర్‌షిప్‌లను మంజూచేస్తామన్నారు. దరఖాస్తుతో పాటు విద్యార్థి ఆధార్‌కార్డు, కుల దృవీకరణపత్రం, బ్యాంక్ పాస్‌బుక్, పాఠశాలలో చదువుతున్నట్లుగా బోనాఫైడ్ సర్టిఫికెట్, రెండు కలర్‌ఫొటోలు, రేషన్‌కార్డు/ ఆహార భద్రతకార్డు జిరాక్స్, తల్లి, తండి ఫోన్ నెంబర్‌లను జతపరచాలన్నారు.