హైదరాబాద్: ప్రముఖ నటిమణి ప్రతిమా దేవి(88) బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో మరిచిపోలేని సినిమాల్లో నటించారు. కన్నడలో తొలి వంద రోజుల చిత్రం జగన్మోహిని ఆమెదే. జగన్మోహినితో పాటు కృష్ణ లీల, చంచల ఉమరి, శివశరణే నమియక్క, మంగళ సూత్రం వంటి సినిమాలతో స్టార్ అయిపోయింది. 2011 లో కర్ణాటక ప్రభుత్వం ప్రతిమా దేవిని లైఫ్ టైం అవార్డుతో సత్కరించింది. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే వ్యాపారవేత్త స్వతంత్ర సమర యోధుడు శంకర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆమె మృతిపై కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమ ఒక లెజెండరీ నటిని కోల్పోయిందని.. ఆమె లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అంటూ సంతాపం ప్రకటించారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ప్రతిమా దేవి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm