ఢిల్లీ: లైంగికదాడి చేసిన వ్యక్తి బాధితురాలితో రాఖీ కట్టించుకుంటే బెయిల్ ఇస్తామంటూ హైకోర్టు షరత్ పెట్టింది. ఇదే షరత్ అంటూ సుప్రీం కోర్టు ఆ హైకోర్టుకు అక్షింతలు వేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి ఓ యువతిపై లైంగికదాడి చేశాడు. నేరం నిరూపణ అయి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈక్రమంలో నింధితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దానికి హైకోర్టు షరతులు విధించింది. అందులో ముఖ్యంగా బాధితురాలితో రాఖీ కట్టించుకుంటే బెయిల్ ఇస్తామని చెప్పింది. ఇంకేముంది..అదో పెద్ద విషయమా? అంటూ దోషి ఓకే అన్నాడు. దీంతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసేసింది. బెయిల్ ఆర్డర్ కూడా ఇచ్చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మహిళా లాయర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. లైంగికదాడి చేసి రాఖీ కట్టించుకుంటే బెయిల్ ఇచ్చేస్తారా? అని ప్రశ్నిస్తూ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ ను సవాలు చేశారు. ఈ విషయంపై తొమ్మిదిమంది మహిళా లాయర్లు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ ను కొట్టివేసింది. మూస ధోరణులకు దారితీసే వ్యాఖ్యలు జడ్జీలు చేయకపోవడమే మంచిది అని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యాలు చేసింది.
హైకోర్టు షరతులివే:
- రక్షాబంధన్ రోజు ఆ బాధిత యువతి ఇంటికి వెళ్లి ఆమెతో రాఖీ కట్టించుకొని జీవితాంతం ఆమె రక్షణగా ఉంటానని హామీ ఇవ్వడం.
- ఆమెకు భరోసాగా రూ.11 వేలు ఇవ్వాలి.
- ఆమెకు పుట్టిన కొడుకుకు కొత్త బట్టలు, స్వీట్లు కోసం రూ.5 వేలు ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది.
దీనిని సవాలు చేస్తూ 9 మంది మహిళా లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ విచారించి సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టు అక్షింతలు వేసింది. అలాగే ఇటువంటి కేసుల్లో న్యాయమూర్తులు, లాయర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అనుసరించడానికి ఓ మాడ్యూల్‌ను రూపొందించాల్సిందిగా జ్యూడీషియల్ అకాడమీకి ఆదేశాలు జారీ చేసినట్లు కోర్టు తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 08 Apr,2021 07:39AM