హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో రైల్వే కార్యాలయాలు ఉన్న భవనంలోని 13వ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్ట్రాండ్ రోడ్‌లోని కొత్త కోయిలాఘాట్ భవనంలో సాయంత్రం ఆరు గంటలకు మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడకు చేరుకున్న పది అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. భవనంలోని 13వ అంతస్తులో తూర్పు, ఆగ్నేయ రైల్వే జోన్లకు చెందిన కార్యాలయాలున్నాయి. అగ్ని ప్రమాదంలో నేపథ్యంలో ఆ భవనంనలోని అన్ని అంతస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించారు. ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై కోల్‌కతా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm