హైదరాబాద్ : ఏపీలోని రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఆర్థిక సాయం చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మేజర్ పోర్టుల అభివృద్ధి మాత్రమే కేంద్రం బాధ్యత అని... మైనర్ పోర్టుల బాధ్యతను రాష్ట్రాలే చూసుకోవాలని తెలిపింది. బీజేపీ సభ్యుడు టీజీ వెంకటేశ్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఓడరేవులు, నౌకాయానశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రామాయపట్నం పెద్ద పోర్టు కాదని రాష్ట్ర ప్రభుత్వమే తెలిపిందని... చిన్న పోర్టుల బాధ్యత కేంద్రానిది కాదని ఆయన చెప్పారు. రామాయపట్నం పోర్టుకు ఆర్థిక సాయం చేయాలంటే చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm