హైదరాబాద్ : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రాష్ట్రంలో 12 నగరపాలక, 75 పురపాలక, నగర పంచాయతీల్లో 2,215 డివిజన్లు, వార్డులకు వివిధ పార్టీల నుంచి 7,552 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నెల 3న నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గత నాలుగురోజులుగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm