హైదరాబాద్: సొంతింటి కళను నిజం చేసుకోవాలనుకోవడం ప్రతీ ఒక్కరి కల. ముఖ్యంగా సొంత ఇంటిని కలిగి ఉండాలన్న కోరిక పురుషుల కంటే మహిళలకు అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవ వేళ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ మహిళా లోకానికి గుడ్ న్యూస్ చెప్పింది. హోమ్ లోన్ తీసుకునే మహిళలకు వడ్డీ రేట్లను 5 బేసిక్ పాయింట్లు తగ్గించనున్నట్లు తెలిపింది. వారికి 6.70 ప్రారంభ వడ్డీ రేట్లతో హోమ్ లోన్స్ అందించనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలకు ఈ ఆఫర్ అందించనున్నట్లు తెలిపింది ఎస్బీఐ. ఈ అవకాశాన్ని మహిళాలోకం సద్వినియోగం చేసుకోవాలని ఎస్బీఐ సూచించింది.
Mon Jan 19, 2015 06:51 pm