హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నీటి మీద తేలియాడే తల్లి బొమ్మని జగిత్యాల జిల్లా రాఘవ పట్నం గ్రామానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు కవి సైకత శిల్పి గాలిపెల్లి చోళేశ్వర్ చారి చేశారు. ఇది వేయడానికి ఒక గంట సమయం పట్టిందని తెలిపారు. నీటిమీద వేయడానికి ప్రత్యేకత ఉందని, ప్రతి మాతృమూర్తి నిటికంటే స్వచ్ఛం అని అందుకే వేసినట్లు తెలిపారు. దీనిద్వారా అందరూ మాతృమూర్తి కి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దీనిని చూసి గ్రామ సర్పంచ్ రాగం శంకరయ్యగారు, ఎంపీటీసీ మధుకర్ రెడ్డి గారు, జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు గాజుల నాగరాజు గారు, రాష్ట్ర నాయకులు భార్గవ్ గారు, యువజన సంఘం నాయకులు, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పలువురు ప్రముఖులు ప్రశంసించారు.
Mon Jan 19, 2015 06:51 pm