హైదరాబాద్ : రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ ఆ బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. నగరంలోని జలవిహార్‌లో జరిగిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రతినిధుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జర్నలిస్టులు, ఉద్యోగులు, న్యాయవాదులతో టీఆర్ఎస్ కు ఉన్నది పేగు బంధమని గతంలో జరిగిన పలు సంఘటనలను గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టులకు రూ.100 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. మరణించిన 260 మంది కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఇచ్చాం. ఇలాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. జర్నలిస్టుల కుటుంబాల పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివించే బాధ్యతను టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm