హైదరాబాద్ : దేశ రాజధానిలో మిట్ట మధ్యాహ్నం ఓ మహిళా కానిస్టేబుల్ లైంగిక వేధింపులకు గురైంది. బస్సులో ప్రయానిస్తుండగా ఓ వ్యక్తి తనని అసభ్యంగా తాకుతూ వికృతంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని పోలీసు కంట్రోల్ రూంలో విధులు నిర్వర్తిస్తోన్న ఓ మహిళా కానిస్టేబుల్(29) బుధవారం విధులకు బస్సులో బయలుదేరింది. రద్దీగా ఉన్న బస్సులో ఆమె పక్కనే ఓ వ్యక్తి నిలుచుని ఉన్నాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తిని తనని అసభ్యంగా తాకడం ఆమె గమనించింది. తన మెడ నుంచి వెనక వరకు అసభ్యంగా తాకుతుండంటంతో అతడిని వారించింది. అయినా అతడు వినకుండా ఆమెతో వికృతంగా ప్రవర్తిస్తూ కామవాంఛ తీర్చుకున్నాడు. అందరూ చూస్తుండగానే బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. అయినా చూట్టూ ఉన్న జనం ఎవరూ కూడా నిందితుడి వారించేందుకు ప్రయత్నించలేదు. చివరకు బాధితురాలు అతడిని పట్టుకుని కొట్టేందుకు ప్రయత్నించగా నిందితుడు హల్మెట్‌తో కానిస్టేబుల్ తలపై కొట్టాడు. దీంతో బాధితురాలి తలకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm