హైదరాబాద్ : సోమాలియా రాజధాని మోగదిషులో బాంబు దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. ఓ రెస్టారెంట్‌లోకి బాంబుతో కూడిన వాహనం దూసుకెళ్లి పేలిపోయింది. దీంతో హోటల్‌తోపాటు సమీప ఇళ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. సుమారు 30 మందికి గాయాలు కాగా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాంబు దాడి వెనుక అల్-షహబ్ సంస్థ హస్తం ఉందని సోమాలియా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm