హైదరాబాద్ : ప్రసిద్ధ కన్నడ కవి, క్రిటిక్, అనువాదకుడు ఎన్‌ఎస్ లక్ష్మీనారాయణ భట్ట శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84. భట్టకు భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన గత కొంతకాలంగా వయసు సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎన్‌ఎస్‌గా సుపరిచితులైన లక్ష్మీనారాయణ భట్ట.. 1936 లో శివమొగ్గ జిల్లాలో జన్మించారు. చిన్ననాటి నుంచే రచనలు చేయడం మొదలుపెట్టిన భట్ట.. తన జీవితకాలంలో కన్నడ సాహిత్యానికి ఎంతో సేవ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm