హైదరాబాద్: నిర్మల్ జిల్లాలోని కడెం మండలం పెద్దూర్లో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. ఒక ఇంట్లో తవ్వకాలు జరిపిన ముగ్గురు కోయ పూజారులు...ఇత్తడి బిందె చేతిలో పెట్టి రూ.21లక్షలు తీసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనను నమ్మించి మోసం చేశారని బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. సదరు మహిళ గ్రామంలో భారీగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm