అమరావతి: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు విశాఖలో ప్రచారాన్ని నిర్వహించారు. రోడ్ షో నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. విశాఖలోని పెందుర్తి కూడలిలో ఆయన ప్రసంగిస్తూ జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును ప్రకటించారు. పీలా శ్రీనివాస్ మేయర్ కావడం ఖాయమని... ఆయన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదేళ్ల పాటు తాను సీఎంగా ఉన్నప్పుడు విశాఖను ఆర్థిక రాజధానిగా చేసేందుకు ఎంతో కృషి చేశానని చెప్పారు. హుదూద్ తుపాను సమయంలో 10 రోజులు విశాఖలోనే ఉన్నానని... నగరం మళ్లీ సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే తిరిగి వెళ్లానని తెలిపారు. విశాఖ ప్రజలు టీఢీపీకి ఘన విజయాన్ని కట్టబెట్టాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm