హైదరాబాద్: తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార ఏఐఏడీఎంకే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీసీఎం పన్నీర్ సెల్వం, మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్, న్యాయశాఖ మంత్రి వే షణ్ముగం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎస్పీ షణ్ముగనాథన్, ఎస్. థెన్ మొళిలకు తొలి జాబితాలో స్థానం లభించింది. తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలు ఉండగా, మిగతా అభ్యర్థులను మరికొన్నిరోజుల్లో ప్రకటించనున్నారు. ఈ మేరకు అన్నాడీఎంకే వర్గాలు కసరత్తులు చేస్తున్నాయి.
తొలి జాబితాలో ఉన్న అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే...
1. పళనిస్వామి- ఎడప్పాడి (సేలం జిల్లా)
2. పన్నీర్ సెల్వం- బోధినాయకన్నూర్ (థేని జిల్లా)
3. డి.జయకుమార్- రాయపురం
4. వే.షణ్ముగం- విల్లుపురం
5. ఎస్పీ షణ్ముగనాథన్- శ్రీవైకుంఠం
6. ఎస్.థేన్ మొళి- నీలక్కొట్టాయ్
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Mar,2021 06:03PM