అమరావతి: విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మండలంలోని దేవుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొండవానిపాలెం గిరిజన గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 పూరిళ్లు దగ్ధమవడంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తహశీల్దారు సీతారామరాజు వెల్లడించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm