హైదరాబాద్: విద్యుత్ అంతరాయం కలుగకుండా తన క్యాంప్ ఆఫీస్‌లో వెంటనే 25 కేవీ జనరేటర్‌ను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను మేయర్ విజయలక్ష్మి కోరారు. తన క్యాంప్ ఆఫీస్‌లో తరచుగా విద్యుత్ అంతరాయం కల్గడంపై మేయర్ విజయలక్ష్మి ఆరా తీశారు. విద్యుత్ అంతరాయం పై జీహెచ్ఎంసీ కమిషనర్‌కు మేయర్ విజయలక్ష్మి ఫైల్ పంపారు. విద్యుత్ అంతరాయంతో తన క్యాంప్ ఆఫీస్‌లో రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందని దానిలో వెల్లడించారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా తన క్యాంప్ ఆఫీస్‌లో 25 కేవీ జనరేటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను మేయర్ కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm