హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం కల్వచర్ల వద్ద గత నెల 17న హత్యకు గురైన న్యాయవాద దంపతులు వామన రావు, పీవీ నాగమణిల హత్య కేసులో ఏ-5 నిందితుడిగా ఉన్న ఊదరి లచ్చయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. మంథని ప్రిన్సిపల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జడ్జి నాగేశ్వరరావు ఎదుట పోలీసులు హాజరుపరిచారు. దీంతో ఆయన నిందితుడికి 14 రోజుల జుడిషియల్ రిమాండ్ కు ఆదేశించారు. లచ్చయ్యను పోలీసు కస్టడీలో కరీంనగర్ కేంద్ర కారాగారానికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm