హైదరాబాద్ : శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శివారులోని నిర్మాణుష్య ప్రాంతంలో ప్రాణాంతక కెమికల్‌ను పారబోసి దుండగులు నిప్పంటించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు భయాందోళన చెందారు. ఇలాంటి ఘటనలు అంతకుముందుకూడా జరిగాయని స్థానికులు చెబుతున్నారు. దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm