హైదరాబాద్: ఒక మహిళను ప్రత్యర్థులు నాటు తుపాకీతో కాల్చి దారుణంగా హతమార్చారు. విశాఖ ఏజెన్సీ పరిధిలో డుంబ్రిగుండ మండలం రంగిల సింగి గ్రామంలో చెలరేగిన భూ వివాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది. గ్రామానికి చెందిన సీతమ్మ అనే మహిళలకు స్థానికంగా కొందరితో భూ వివాదం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇవాళ బయటకు వెళ్లిన ఆమె హత్యకు గురైంది. భూ వివాదం కారణంగా ప్రత్యర్థులే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm